ముగించు

రెవిన్యూ డివిజన్

పరిపాలనా సౌలభ్యము కొరకు జిల్లాను రెండు రెవిన్యూ డివిజన్లుగా విభజించిరి. ప్రతీ రెవెన్యూ డివిజన్ కు ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్విస్ కేడర్ లేక డెప్యూటీ కలక్టర్ హోదా కల్గిన అధికారి రెవిన్యూ డివిజనల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈయన తన పరిధిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా వ్యవహరిస్తారు. తహసిల్దారు హోదా కల్గిన అధికారి ఈయనకు పరిపాలనలో సహాయకుడిగా వ్యవహరిస్తారు. సబ్ డివిజనల్ అధికారి కార్యాలయములు కలెక్టర్ కార్యాలయములో మాదిరి పరిపాలనా సౌలభ్యము కొరకు వివిధ శాఖలను కల్గి ఉండి పరిపాలన కొనసాగుతుంది. ప్రతి డివిజన్ కొన్ని మండలాలను కల్గియుండి వాటి సామర్ధ్యాలను తరచూ పర్యవేక్షించుటకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి ఉంటారు.

  • రెవెన్యూ డివిజినల్ అధికారి, పాడేరు 
  •  రెవెన్యూ డివిజినల్ అధికారి,  రంపచోడవరం